ఆదా శర్మ తప్పించుకుంది.. లేకుంటే వ్రేలు ఊడిపోయేది !

ఆదా శర్మ తప్పించుకుంది.. లేకుంటే వ్రేలు ఊడిపోయేది !

యాక్షన్ సినిమాలంటే హెవీ ఫైట్ సీన్స్, స్టంట్స్, ఛేజింగ్ ఎపిసోడ్స్ తప్పకుండా ఉంటాయి.  అవి చేయడానికి నటీనటులు చాలా రిస్క్ చేస్తుంటారు.  ఒక్కోసారి తీవ్రమైన ప్రమాదలకు గురువుతుంటారు కూడ.  తాజాగా హీరోయిన్ అదా శర్మ ఇలాంటి ప్రమాదాన్నే ఎదుర్కొంది. 

ప్రస్తుతం ఆమె విద్యుత్ జమ్వాల్ తో కలిసి 'కమాండో 3' అనే బాలీవుడ్ చిత్రం చేస్తోంది.  ఈ చిత్ర షూటింగ్ సమయంలో కార్ స్టంట్ చేసేప్పుడు అదా శర్మ ఎడమ చేయి కార్ డోర్ మధ్యలో బలంగా ఇరుక్కుపోయింది.  దీంతో చిటికిన వ్రేలు దాదాపు చితికిపోయి ఊడిపోయినంత పనైంది.  ప్రమాదం సంభవించిన వెంటనే టీమ్ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు సర్జరీ నిర్వహించి వ్రేలును సరిచేయడం జరిగింది.  ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపిన ఆదా శర్మ నా వ్రేలు నా శరీరం నుండి విడిపోనందుకు సంతోషంగా ఉంది అన్నారు.