సైని, సిరాజ్ లకు క్షమాపణలు చెప్పిన గిల్‌క్రిస్ట్... ఎందుకంటే..?

సైని, సిరాజ్ లకు క్షమాపణలు చెప్పిన గిల్‌క్రిస్ట్... ఎందుకంటే..?

ఆస్ట్రేలియా జట్టులో ఉండే చాలా తక్కువ మంది జెంటిల్మెన్ ఆటగాళ్లలో ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఒకడు. అయితే ఈ స్టార్ వికెట్ కీపర్ భారత పేసర్లు అయిన నవదీప్ సైని, మహ్మద్ సిరాజ్ లకు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాడు. అయితే భారత జట్టు ఆసీస్ కు వెళ్లిన తర్వాత సిరాజ్ తండ్రి మరణించిన విషయం తెలిసిందే. తన తండ్రి మరణం తర్వాత కూడా ఆసీస్ పర్యటనకు ఎంపికైన సిరాజ్ తిరిగి భారత్ రాకుండా అక్కడే జట్టుతో పాటు ఉండాలని నిర్ణయించుకున్నాడు. దాంతో మాజీలు చాలా మంది తనని ప్రశంసిస్తూ... ధైర్యంగా ఉండాలని సూచించారు. అయితే తాజాగా గిల్‌క్రిస్ట్ కూడా దీని పై స్పందించాడు. కానీ మొదట అతను సైని తండ్రి మరణించినట్లుగా తెలిపాడు. కానీ తర్వాత తన తప్పు తెలుసుకొని ట్విట్టర్  వేదికగా సైని, సిరాజ్ లకు క్షమాపణలు చెప్పాడు.