ఆ నలుగురు ఉత్తమం... అందులో అతను అత్యుత్తమం...

ఆ నలుగురు ఉత్తమం... అందులో అతను అత్యుత్తమం...

ఆస్ట్రేలియా మాజీ బాట్స్మెన్, వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ తన జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. ఆసీస్ జట్టులో నిజాయితీ ఉన్న ఆటగాడు ఎవరు అనే ప్రశ్న వస్తే క్షణం  ఆలోచించకుండా అందరూ గిల్‌క్రిస్ట్ పేరు చెపుతారు. ఇక వికెట్ కీపర్ గా చాల రికార్డులు సాధించిన ఆడమ్ క్రికెట్ లో అత్యుత్తమ వికెట్ కీపర్ ఎవరు అనే ప్రశ్నకు సమాధానం చెప్పాడు. మడోన్నా టిక్సేరాతో లైవ్ లో మాట్లాడిన ఆడమ్ గిల్‌క్రిస్ట్,  ఉత్తమ వికెట్ కీపర్లుగా కుమార్ సంగక్కర, మార్క్ బౌచర్, బ్రెండన్ మెక్కల్లమ్ అలాగే ఎంఎస్ ధోనిని ఎంచుకున్నాడు. కానీ ఆ నలుగురిలో ధోని అత్యుత్తమం అని చెప్పాడు. ''చూడండి నా పేరు గిల్లీ, సిల్లీ కాదు. నేను చాలా మంది ఆటగాళ్లను చూసాను. కాబట్టి, నా సమయం లో ఆడిన కీపర్ లలో ధోని అగ్రస్థానంలో ఉన్నాడు, తరువాత సంగకర మరియు మెక్కల్లమ్ , మార్క్ బౌచర్ ఉన్నారు'' అని చెప్పాడు. ధోని 2019 ప్రపంచ కప్ నుండి పోటీ క్రికెట్ ఆడలేదు. దాంతో అంతర్జాతీయ క్రికెట్‌లో తన భవిష్యత్తు గురించి పుకార్లు చెలరేగుతున్నాయి, అయితే ఎంఎస్ ధోని ఐపీఎల్ 2020 లో చెన్నై సూపర్ కింగ్స్‌కు నాయకత్వం వహించనున్నారు, యుఎఇలో సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు జరగనున్న ఈ లీగ్ కోసం ప్రస్తుతం ధోని సిద్ధమవుతున్నాడు.