'టీఆర్‌ఎస్‌తో ఎన్నికల కమిషన్‌ చేతులు కలిపి..'

'టీఆర్‌ఎస్‌తో ఎన్నికల కమిషన్‌ చేతులు కలిపి..'

ఎన్నికల్లో ఎలక్షన్‌ కమిషన్‌తో కలిసి కేసీఆర్ కుటుంబం అకృత్యాలకు పాల్పడిందని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఆరోపించారు. ఇవాళ హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ వీవీపాట్‌లను లెక్కించమంటే రజత్‌కుమార్‌ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తెలంగాణలో జరిగిన ఆకృత్యాలను దేశ వ్యాప్త చర్చకు తెస్తానన్న దయాకర్‌.. టీఆర్‌ఎస్‌ చెప్పినట్టు వినలేదనే.. సూర్యాపేట కలెక్టర్‌ను బదిలీ చేశారని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం తీరు కూడా సరిగా లేదన్న దయాకర్‌..  ఎన్నికల అధికారులు గడ్డి పీకూతున్నారా..? అని ప్రశ్నించారు.