అదుగో బంటి డ్యాన్స్..!!

అదుగో బంటి డ్యాన్స్..!!

రవిబాబు సినిమాలు వినూత్నంగా ఉంటాయని అల్లరి సినిమా నిరూపించింది.  ఆ తరువాత చేసిన సినిమాలు కూడా అదే కోవకు చెందినవే.  ఇప్పుడు టాలీవుడ్ లో మరో ప్రయోగం చేయబోతున్నాడు.  ఓ చిన్న పందిపిల్లను మెయిన్ రోల్ గా తీసుకొని అదుగో అనే సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమాలో హీరో ఆ పందిపిల్లనే... దానిపేరు బంటి.  ఇది చేసే అల్లరి అంతా ఇంతా కాదు.  అల్లరి చేయడమే కాదండోయ్ సాంగ్ ప్లే చేస్తే డ్యాన్స్ కూడా చేస్తుందట.  మరి దీని అల్లరి ఏంటో తెలియాలంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే అంటున్నాడు రవిబాబు.  సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్నది.  ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నాడు.