రివ్యూ : అదుగో

రివ్యూ : అదుగో

నటీనటులు : అభిషేక్ వర్మ, నభ నటేష్, రవిబాబు, సాత్విక్, ఆర్కే తదితరులు 

మ్యూజిక్ : ప్రశాంత్ ఆర్ విహార్ 

ఫోటోగ్రఫి : ఎన్ సుధాకర్ రెడ్డి 

నిర్మాత : డి సురేష్ బాబు 

దర్శకత్వం : రవిబాబు 

విడుదల తేదీ : 07-11-2018

రవిబాబు సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి అనడంలో సందేహం లేదు.  మొదటి సినిమా అల్లరి నుంచే వైవిద్యం కనిపించింది.  పిల్లలను, పెద్దలను అలరించే సినిమాలు తీయడానికి ఎక్కువగా రవిబాబు ఆసక్తి చూపుతుంటాడు.  ఇప్పుడు పందిపిల్ల ప్రధాన పాత్రధారిగా అదుగో అనే ప్రయోగం చేశారు.  మరి ఈ ప్రయోగం సక్సెస్ అయిందా లేదా ఇప్పుడు చూద్దాం.  

కథ : 

పందిపిల్ల తన తండ్రి చెప్పిన మాటలను వినకుండా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది.  ఇలా బయటకు వెళ్లిన పందిపిల్ల రవిబాబు, దుర్గా అనే రౌడీ ముఠాకు చిక్కుతుంది.  అదే సమయంలో భూమికి సంబంధించిన ఓ మైక్రో చిప్ ను పందిపిల్ల మింగేస్తుంది.  ఎలాగైనా దానిని పట్టుకొని ఆ చిప్ ను దక్కించుకోవడాని ప్రయత్నం చేస్తుంటారు.  ఆ ముఠా నుంచి తప్పించుకున్న పందిపిల్ల నభా, అభిషేక్ వర్మ అనే ప్రేమికుల చేతికి చిక్కుతుంది.  వీరిని కూడా ఆ ముఠా ఇబ్బందులు పెడుతుంటారు.  ఇంతలో హైదరాబాద్ నగరంలో పందిపిల్లలు రేసింగ్ జరుగుతుంది.  ఇప్పుడు ఈ ముఠాకు ఆ పందిపిల్ల అవసరం అవుతుంది.  పందిపిల్ల ఆ ముఠాకు చిక్కిందా...? ప్రేమ జంట పడిన ఇబ్బందులు ఏంటి..? రేసింగ్ లో పందిపిల్ల విజయం సాధించిందా అన్నది మిగతా కథ.  

విశ్లేషణ : 

జంతువుల నేపథ్యంలో సాగే కథ ఇది.  ఈ సినిమా చూస్తున్నంత సేపు హాలీవుడ్ సినిమాలు గుర్తుకు వస్తాయి.  ఇలాంటి సినిమాలను హాలీవుడ్ కు కొత్త కాకపోయినా.. మనకు చాలా కొత్త.  ఇలాంటి సినిమాలు తీయడం కష్టంతో కూడుకున్నదే.  అప్పుడెప్పుడో రాజమౌళి ఈగ సినిమాతో మెప్పించాడు.  ఇన్నాళ్లకు రవిబాబు పందిపిల్లతో మెప్పించే ప్రయత్నం చేశాడు.  పందిపిల్లతో చేయించిన విన్యాసాలు అక్కడడక్కడా నవ్విస్తాయి. కథ పరంగా పందిపిల్ల హీరోగా చూపించినా దానిని చూడడానికి ప్రేక్షకులు కాస్త చిరాకు పడతారు.  కొన్ని సన్నివేశాలు రొటీన్ గా బోర్ కొట్టించేవిధంగా ఉన్నాయి.  పందిపిల్లతో రౌడీలకు లిప్ కిస్ ఇప్పనుంచే సన్నివేశాలు, దానికి ఆముదం తాగించే సన్నివేశాలను చూడలేం.  భయానకంగా ఉంటాయి అవి.  కథ ఎటువైపు వెళ్తున్నదో, ఎవరికోసం వెతుకుతున్నారో అర్ధం కానట్టుగా ఉంటుంది.  సినిమాలో ఎక్కడా సీరియస్ నెస్ కనిపించదు.  పందిపిల్లతో చేయించిన విన్యాసాలు తప్పించి సినిమాలో మరేమి కనిపించలేదు. 

నటీనటుల పనితీరు : 

పందిపిల్ల చేసిన విన్యాసాలు ఆకట్టుకుంటాయి.  రవిబాబు, నభా నటేష్ లు తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.  సిక్స్ ప్యాక్ శక్తిగా రవిబాబు సందడి బాగుంది.  

సాంకేతిక వర్గం : 

సాంకేతికంగా సినిమా ఆకట్టుకుంది.  లైవ్ యానిమేషన్ చిత్రంగా రూపొందించిన విధానం, విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణ.  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.  

పాజిటివ్ పాయింట్స్ : 

పందిపిల్ల విన్యాసాలు 

టెక్నికల్ 

మైనస్ పాయింట్స్ : 

కథ 

సాగతీత సన్నివేశాలు 

చివరిగా :  విన్యాసాలు తప్ప నవ్వులు లేవు.