రషీద్ కు టెస్టుల్లో చోటు?

రషీద్ కు టెస్టుల్లో చోటు?

టీమిండియా కెప్టెన్ విరాట్ పుణ్యమాని ఇంగ్లండ్‌ లెగ్‌ స్పిన్నర్‌ అదిల్‌ రషీద్‌ టెస్టు జట్టులో చోటుదక్కించుకోనున్నాడు. టీమిండియాతో జరిగిన సిరీస్ డిసైడర్ మూడో వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలిచి సిరీస్‌ ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత్‌ ఇన్నింగ్స్‌ ను ముందుకు నడిపిస్తున్న టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి ని క్లీన్‌ బౌల్డ్‌  చేసి దెబ్బ తీసాడు. అక్కడి నుండి ఇండియా పతనం మొదలయ్యి మ్యాచ్ చేజార్చుకుంది. ఏ పిచ్ అయినా సరే స్పిన్‌ బౌలింగ్‌ను సమర్ధవంతగా కోహ్లీ ఎదుర్కోగలడు. కానీ అనూహ్యంగా లెగ్‌ స్పిన్నర్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. కోహ్లీ ఇంతవరకు లెగ్‌ స్పిన్నర్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ కాలేదు. దీంతో టెస్టుల్లో భారత కెప్టెన్ ను ఇబ్బంది పెట్టాలనే ఆలోచనలో ఉన్న ఇంగ్లాండ్ రషీద్ ను ఎంపిక చేసుకోవాలనుకుంటుంది.

రషీద్‌ ఇప్పటివరకు ఆడిన టెస్టుల్లో విఫలమవడంతో ఇంగ్లండ్‌ సెలక్టర్లు వన్డే, టీ-20లకే పరిమితం చేశారు. రషీద్ ఆడిన చివరి టెస్టు 2016లో భారత్‌ పైనే. భారత్‌తో వన్డే సిరీస్‌లో రాణించడంతో సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. తాజా ప్రదర్శన ప్రకారం రషీద్ ను టెస్టుల్లో ఎంపిక చేయాలనే ఆలోచనలో సెలక్టర్లు ఉన్నట్టు సమాచారం.