రికార్డు స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు..

రికార్డు స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు..

ఈదురు గాలులు తగ్గిన తర్వాత కాస్త తగ్గినట్టే తగ్గి మళ్లీ చలిపులి పంజా విసురుతోంది... తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి... ఇక ఆదిలాబాద్ జిల్లాలో గత మూడు రోజులుగా అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలోని భీంపూర్‌ మండలం అర్లి-టిలోమూడు రోజులుగా రికార్డ్ స్థాయికి పడిపోయాయి కనిష్ట ఉష్ణోగ్రతలు... మొన్న 3 డిగ్రీలు, నిన్న 2.7 డిగ్రీలు, ఇవాళ 2.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక స్థానికులను పలకరించేందుకు అర్లి-టి గ్రామానికి వెళ్లింది ఎన్టీవీ బృందం... 60 ఏళ్ల నుంచి ఇంత చలి చూడలేదని ఎన్టీవీకి తెలిపారు స్థానికులు. గ్రామానికి ప్రభుత్వం దుప్పట్లు, స్కూల్ పిల్లలకు స్వెట్టర్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక చలి తీవ్రతతో ఉదయం 10 దాటితే గాని వంట చేసుకునే పరిస్థితి లేదని చెప్పారు మహిళలు.