లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

అంత‌ర్జాతీయ మార్కెట్ల‌న్నీ గ్రీన్‌లో ఉన్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు ముఖ్యంగా నాస్ డాక్ రెండు శాతంపైగా పెరిగింది. డాల‌ర్ ఇండెక్స్ స్వ‌ల్పంగా త‌గ్గుముఖం ప‌ట్ట‌గా, ముడి చ‌మురు ధ‌ర‌ల్లో ప‌త‌నం కొన‌సాగుతోంది. మొన్న‌టి దాకా 85 డాల‌ర్ల‌కు చేరిన బ్రెంట్ క్రూడ్ ధ‌ర ఇపుడు 75 డాల‌ర్ల లోపుకు వ‌చ్చింది. దీంతో వ‌ర్ధ‌మాన మార్కెట్లు ప్ర‌ధానంగా చ‌మురుపై ఆధార ప‌డ్డ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఒక్క జ‌పాన్ నిఫ్టీ మిన‌హా ఆసియా సూచీల‌న్నీ గ్రీన్‌గా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో నిఫ్టి 32 పాయింట్ల లాభంతో 10,418 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. అమెరికాలో ఐటీ షేర్లు పెరిగినా.. మ‌న ద‌గ్గ‌ర క్షీణించాయి. ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి 20 పైస‌ల‌కు పైగా బ‌ల‌ప‌డ‌టం దీనికి కార‌ణం కావొచ్చు. 

నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో ఎల్ అండ్ టీ టాప్‌లో ఉంది. ఈ కంపెనీ ఫ‌లితాలు బాగుండ‌ట‌మే దీనికి కార‌ణం. హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ, ఎస్ బ్యాంక్‌, ఇన్‌ఫ్రాటెల్ షేర్లు కూడా లాభాల జాబితాలో త‌రువాతి స్థానాల్లో ఉన్నాయి.  ఇక న‌ష్టాల్లో ఉన్న నిఫ్టి షేర్ల‌లో దాదాపు అన్ని ఐటీ షేర్లే. టెక్ మ‌హీంద్రా, టీసీఎస్‌, హెచ్‌సీఎల్ టెక్‌, విప్రో, ఇన్ఫోసిస్ షేర్లు ఉన్నాయి. ఇత‌ర షేర్లలో దీవాన్ హౌసింగ్ ఇవాళ మ‌రో 4 శాతం పెరిగింది.