'అమ్మ ఒడి' పథకంపై కీలక ప్రకటన

'అమ్మ ఒడి' పథకంపై కీలక ప్రకటన

2020 జనవరి 26వ తేదీ నుంచి 'అమ్మ ఒడి' పథకం ప్రారంభించనున్నట్టు  విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ఈమేరకు ఇవాళ ఆయన అసెంబ్లీలో ప్రకటన చేశారు. పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలకు పిల్లలను పంపించే అర్హురాలైన ప్రతి తల్లికి ఈ పథకం కింద ఏటా రూ.15 వేలు చొప్పున అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను వసతులను మెరుగుపరుస్తామని, విద్యా ప్రమాణాలను పెంచుతామని ఆయన అన్నారు. తద్వారా ప్రభుత్వ పాఠశాల్లలో చేరికలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా రుచికరమైన, పరిశుభ్రమైన భోజనాన్ని అందిస్తామని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినా..  తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేశామని సురేష్‌ గుర్తు చేశారు. 'రాజన్న బడిబాట' ద్వారా విద్యార్థులు బడికి వెళ్లేలా చొరవ తీసుకున్నామని తెలిపారు.