నాటు సారా ను స్కార్చ్ బాటిల్లో పోసి అమ్ముతున్నారు !

నాటు సారా ను స్కార్చ్ బాటిల్లో పోసి అమ్ముతున్నారు !

కడప జిల్లా జమ్మలమడుగులో  మాజీమంత్రి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జీహెచ్ యంసి ఎన్నికల్లో అధిక స్థానాల్లో బిజెపి అభ్యర్థులు విజయం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. దుబ్బాక ఎన్నికల్లో  తెరాస పార్టీ గెలుపు  కోసం సిఎం జగన్ గట్టి గా  ప్రత్నించారని ఆయన అన్నారు. ఇక కడప జిల్లా లో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందన్న ఆయన గండి కోట ముంపు వాసులకు సరైన న్యాయం చేయకుండా నీటిని ఎక్కువగా నిల్వ చేస్తున్నారని అన్నారు. ఇక తిరుపతి ఉపఎన్నిక కావాలని జగన్ కోరతారు.. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం వద్దంటారని ఆయన ఎద్దేవా చేశారు. ఇక నాటు సారాను ఏపీలో స్కాచ్ బాటిల్లో పోసి అమ్ముతున్నారని ఆయన అన్నారు.