ఆదిపురుష్ నుంచి మరో అప్‌డేట్.. అంతా చూపించారుగా..

ఆదిపురుష్ నుంచి మరో అప్‌డేట్.. అంతా చూపించారుగా..

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓం రౌత్‌తో చేయనున్న ఆదిపురుష్ కూడా ఒకటి. అయితే ప్రస్తుతం ప్రభాస్ వేరే సినిమాతో బిజీగా ఉండటంతో ప్రభాస్ లేకుండానే ఓంరౌత్ ఆదిపురుష్‌ను మొదలు చేయనున్నాడు. దీనికి సంబంధించిన చిత్రీకరణ పనులను కూడా మొదలుపెట్టేశాడు. ప్రభాస్ లేనటువంటి సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఇందులో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్న బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పాల్గొననున్నాడు. దీంతో అతి త్వరలో ఆదిపురుష్ చిత్రీకరణను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఆదిపురుష్ టీం అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ముందుగా ప్రకటించిన దాని ప్రకారం నేడు ఉదయం మరో ప్రకటన చేశారు. ఈ ప్రకటన ద్వారా తమ కొత్త అప్‌డేట్ ఇచ్చారు. ఇందులో ఆదిపురుష్ దర్శకుడు ఓంరౌత్‌తో పాటు వీఎఫెక్ట్స్ టీం మొత్తం చూపిస్తూ ఓ ఫోటో షేర్ చేశారు. ఆదిపురుష్ ప్రపంచాన్ని చూపించడానికి మోషన్ వర్క్ ప్రారంభమైందని అందులో పేర్కొన్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఇక త్వరలో ప్రభాస్ ఎలా కనిపిస్తాడన్న దానిపై పక్కా క్లారిటీ వస్తుందని అంటున్నారు.