"హిట్" సీక్వెల్ పనిలో నాని.. విష్వక్ సేన్ ప్లేస్ లో మరో హీరో
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నాచురల్ స్టార్ నాని నిర్మాతగా వచ్చిన సినిమా హిట్. ఈ సినిమాతో శైలేష్ కొలను దర్శకుడుగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా ఓ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా రూపొందింది. విడుదలైన మొదటి రోజునుండే సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్లు భారీగానే రాబట్టి 'హిట్' సినిమా హిట్ అనిపించుకుంది. అయితే.. మొన్నటి వరకు ఈ సినిమాను హిందీలోనూ రీమేక్ చేస్తున్నారని సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలోనే మరో న్యూస్ వైరల్ అయింది. త్వరలో ఈ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతుందని టాక్. ఇందులో హీరోగా మాత్రం విశ్వక్ సేన్‌ను పక్కకు పెట్టనున్నారట. విశ్వక్ ప్లేస్‌లో అడవి శేష్ కథానాయకుడిగా నటించబోతున్నాడు. మార్చిలో సెట్స్ మీదకు వెళ్లే ఈ సినిమాకు నాని నిర్మాతగా వ్యవహరించనున్నాడు. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన శైలేష్ కొలను సీక్వెల్‌ను కూడా డైరెక్ట్ చేయబోతున్నాడు. అయితే.. దీనిపై మరి కొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)