న్యాయవాది రామారావు ఆత్మహత్యాయత్నం..

న్యాయవాది రామారావు ఆత్మహత్యాయత్నం..

హైదరాబాద్‌లోని పద్మారావునగర్‌కు చెందిన న్యాయవాది రామారావు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి. రామారావు తనను లైంగికంగా వేధిస్తున్నారని చిలకలగూడ పోలీసులకు జూనియర్‌ అడ్వకేట్‌ షాదన్‌ ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో విచారించేందుకు అదుపులోకి తీసుకోవాలని భావించిన పోలీసులు.. రామారావు ఇంటికి వెళ్లారు. పోలీసులను చూసిన రామారావు.. బాత్‌రూమ్‌లోకి వెళ్లి హార్పిక్‌ తాగి ఆత్మహత్యకు యత్నించారు. అతణ్ని చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రికి పోలీసులు తరలించారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డిపై గతంలో ఈ న్యాయవాదే పిటిషన్‌ వేశారు.