సిరిసిల్లలో అతిపెద్ద బతుకమ్మ ఘాట్

 సిరిసిల్లలో అతిపెద్ద బతుకమ్మ ఘాట్

మహిళల్లో ఆనందోత్సవాలు నింపుతూ బతుకమ్మ సంబరాలు ఎంతో అంబరంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మొదలయ్యాయి. ఆటలు, పాటలతో మహిళలు ఉత్సహంగా గడుపుతున్నారు. మానేరు తీరంలో అధికారికంగా ఆట్టహాసంగా బతుకమ్మ సంబరాలను జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా ప్రారంభించారు. సాంస్కృతిక వేడుకలు కూడా అలరించాయి. ఈ సారి మానేరు తీరం ప్రాంతం అంతా భారీ ఏర్పాట్లను వివిధ శాఖల యంత్రాంగం పూర్తిచేశారు. జిల్లా మంత్రి కేటీఆర్ బతుకమ్మ సంబరాల వీడియోను తన ట్విట్టర్ లో ఉంచారు. సిరిసిల్ల పట్టణంలో జరుగుతున్న బతుకమ్మ సంబరాలను దృశ్యాలను పోస్ట్ చేశారు. రాత్రి వేళలో విద్యుత్ దీపాల కాంతుల నడుమ బతుకమ్మ సంబరాలు జరిగే ప్రాంగణం శోభాయమానంగా మారింది.