ఆఫ్ఘానిస్థాన్ లో మహిళా జర్నలిస్ట్ పై కాల్పులు

ఆఫ్ఘానిస్థాన్ లో మహిళా జర్నలిస్ట్ పై కాల్పులు

ఆఫ్ఘానిస్థాన్ లో గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ మహిళా జర్నలిస్ట్ మృతి చెందారు. ఆఫ్గానీ జర్నలిస్ట్, పార్లమెంట్ సాంస్కృతిక సలహాదారు మీనా మంగల్ స్థానిక చానల్‌లో న్యూస్ రీడర్‌గా పనిచేస్తుంది. కాబూల్ 8వ జిల్లాలోని కార్తే నవ్ మార్కెట్ రోడ్డులో ఉదయం 7.20 గంటలకు ఆమెను దుండుగులు హత్య చేశారు . ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మోటర్ సైకిల్ వచ్చిన ఇద్దరు దుండగలు.. ఆమెపై కాల్పులు జరిపారు. మొదట గాల్లో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి.. జనాన్ని చెదరగొట్టారు. ఆ తర్వాత నేరుగా ఆమె ఛాతి భాగంలో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో మీనా మంగల్ ఘటనాస్థలంలో ప్రాణాలు విడిచారు. దశాబ్ద కాలం పాటు టీవీ వ్యాఖ్యాతగా మీనా మంగళ్ పని చేశారు. బాలికలు, స్త్రీల సమస్యలపై సొంతంగా ఒక వెబ్ సైట్ కూడా నిర్వహిస్తున్నారు.