21వ శతాబ్దంలో.. తొలి ఐపీఎల్‌ క్రికెటర్‌

21వ శతాబ్దంలో.. తొలి ఐపీఎల్‌ క్రికెటర్‌
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) అంటే అందరికీ అదో క్రేజ్‌. ఆస్ట్రేలియా క్రికెటర్లు సైతం ఈ టోర్నీలో ఆడాలని తహతహలాడుతుంటారు. కానీ స్టార్‌ క్రికెటర్లందరికీ ఐపీఎల్‌లో చోటు దక్కదు. టాలెంట్‌ ఉంటే సరిపోదు.. ఫ్రాంచైజీలకు కూడా నచ్చాలి.. ఇదే లాజిక్‌తో కొనసాగుతున్న ఐపీఎల్‌లో అఫ్ఘానిస్తాన్‌ బౌలర్‌ ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌ రికార్డు నెలకొల్పాడు. 21వ శతాబ్దంలో జన్మించి ఐపీఎల్‌లో ఆడుతున్న తొలి క్రికెటర్‌గా రహ్మాన్‌ నిలిచాడు. అలాగే.. అతి తక్కువ వయసులో ఐపీఎల్‌లో ఆడుతున్న క్రికెటర్‌గానూ ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌ రికార్డు నమోదు చేశాడు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుకు రహ్మాన్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం ఈ ఆఫ్‌బ్రేక్‌ బౌలర్‌.. అఫ్ఘనిస్తాన్‌ జాతీయ క్రికెట్‌ జట్టు తరఫున అతిపిన్న వయసులో అరంగ్రేటం చేసిన ఆటగాడిగా కూడా గతంలో రికార్డు నమోదు చేశాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ తరఫున ముజీబ్‌ అరంగ్రేటం చేశాడు. ప్రస్తుతం రహ్మాన్‌ వయసు 17 ఏళ్ల 11 రోజులు. గతంలో అతి పిన్న వయసు రికార్డు సర్ఫరాజ్‌ అహ్మద్‌ పేరిట ఉండేది. అతితక్కువ వయసులో ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన టాప్‌-5 ఆటగాళ్లు ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌ -17 ఏళ్ల 11 రోజులు, సర్ఫరాజ్‌ అహ్మద్‌ -17 ఏళ్ల 177 రోజులు, ప్రదీప్‌ సంఘ్వాన్‌-17 ఏళ్ల 179 రోజులు, వాషింగ్టన్‌ సుందర్‌- 17ఏళ్ల 199 రోజులు, రాహుల్‌ చహర్‌ -17 ఏళ్ల 247 రోజులు