వరల్డ్‌కప్‌: అఫ్గాన్‌పై అలవోకగా..

వరల్డ్‌కప్‌: అఫ్గాన్‌పై అలవోకగా..

వరల్డ్‌కప్‌ను ఆస్ట్రేలియా విజయంతో ప్రారంభించింది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో  7 వికెట్లతో ఘన విజయం సాధించింది. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన ఓపెనర్‌ వార్నర్‌ (114 బంతుల్లో 8 ఫోర్లతో 89 నాటౌట్‌) అదరగొట్టాడు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్థాన్ 207పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు డకౌట్ కావడం, కీలక బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేయడంతో ఆఫ్గాన్ అతి తక్కువ స్కోర్ నమోదు చేసింది. జార్దాన్ 51, రహ్మత్ షా 43, గుల్బదిన్ 31, రషీద్ ఖాన్ 27 పరుగులు చేశారు. ఆసీస్ బౌలింగ్‌లో పాట్ కమ్మిన్స్ 3, ఆడం జంపా చెరి మూడు, మార్కస్ స్టొయినిస్ 2, మిచెల్ స్టార్క్ 1 వికెట్ తీశారు. 

208 పరుగుల టార్గెట్‌ను ఆసీస్‌ 34.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ ఛేదించింది. వార్నర్‌తోపాటు ఓపెనర్‌ ఫించ్‌ (49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 66) రాణించాడు. ఫించ్‌-వార్నర్‌ తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించారు.  ఖవాజా(15), స్మిత్‌(18)లు వెనుదిరిగినా వార్నర్‌ అజేయంగా నిలిచి 91 బంతులు మిగిలుండగానే ఆసీస్‌ను గెలిపించాడు.