భారత్‌తో టెస్టుకు అఫ్గాన్‌ జట్టు ఇదే

భారత్‌తో టెస్టుకు అఫ్గాన్‌ జట్టు ఇదే

టీమిండియాతో జరిగే ఎకైక టెస్టుకు అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు 16 సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. భారత్‌లోని పిచ్ లు స్పిన్ కు అనుకూలం కాబట్టి అఫ్గానిస్తాన్‌ జట్టు స్పిన్నర్లకు పెద్ద పీట వేసింది. జట్టులో మొత్తం ఐదుగురు స్పిన్నర్లకు అవకాశం కల్పించింది. బెంగళూరు వేదికగా జూన్‌ 14న ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ టెస్టు జట్టుకు అస్గార్‌ స్టానిక్‌జై కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ మ్యాచ్‌ తో అఫ్గాన్‌ టెస్టుల్లో అరంగేట్రం చేయనుంది. మణికట్టు స్పిన్నర్లు రషీద్‌ ఖాన్‌, నబీ, ముజీబ్‌ఉర్‌ రెహ్మాన్‌ లు కీలక పాత్ర పోషించనున్నారు.

జట్టు:

అస్గార్‌ స్టానిక్‌ జై (కెప్టెన్‌), జావెద్‌ అహ్మద్‌, ఇషానుల్లా, మహ్మద్‌ షాహజాద్‌ (వికెట్‌ కీపర్‌), ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌, నాసిర్‌ జమాల్‌, రహమత్‌ షా, హస్మతుల్లా షాహిదీ, అఫ్సార్‌ జాజై, మహ్మద్‌ నబీ, రషీద్‌ ఖాన్‌, జహీర్‌ఖాన్‌, అమీర్‌ హమ్జా, సయ్యద్‌ షిర్జాద్‌, యామిన్‌ అహ్మద్‌జై, వాఫదార్‌. 

Photo: FileShot