శ్రీలంక 201 ఆలౌట్, ఆఫ్గాన్ టార్గెట్ 187

శ్రీలంక 201 ఆలౌట్, ఆఫ్గాన్ టార్గెట్ 187

ప్రపంచ కప్ లో భాగంగా కార్డిఫ్ లోని సోఫియా గార్డెన్స్ లో ఆఫ్గానిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక స్వల్ప స్కోర్ కే పరిమితమైంది. 36.5 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌట్ అయింది. ఆటకు వర్షం అంతరాయం కలిగిస్తుండటంతో డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆఫ్గాన్ టార్గెట్ ను సవరించారు. 41 ఓవర్లలో 187 పరుగులు చేయాల్సి ఉంది. శ్రీలంక ఆటగాళ్లలో కుశాల్ పెరీరా (81 బంతుల్లో 78 పరుగులు, 8 ఫోర్లు), కెప్టెన్ దిముత్ కరుణరత్నె (30 ప‌రుగులు) ఇద్దరే రాణించారు. కుశాల్‌ మెండిస్‌ (2), ఏంజెలో మాథ్యూస్‌ (0), ధనంజయ డిసిల్వా (0), తిసారా పెరీరా (2), ఇరుసు ఉడాన (10), లసిత్‌ మలింగ (4), నువాన్‌ ప్రదీప్‌ (0) వెంటవెంటనే పెవిలియన్ చేరారు. ఆఫ్గాన్ బౌలింగ్ లో మహ్మద్‌నబీ  4 వికెట్లు, రషీద్‌ ఖాన్‌, దవ్లత్‌ ఖాన్ తలో రెండు వికెట్లు తీసి శ్రీలంకను భారీ దెబ్బ కొట్టారు.