ఐపీఎల్ ప్రారంభానికి ముందే రికార్డు నెలకొల్పిన సన్రైజర్స్ బౌలర్...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2016 లో విజయం సాధించిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ ఏడాది కూడా టైటిల్ సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగ్గుతుంది. అయితే ఐపీఎల్ అన్ని జట్ల కంటే బౌలింగ్ బలంగా ఉన్న జట్టు ఏది అంటే సన్రైజర్స్ ముందు ఉంటుంది. అందులో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ముఖ్యమైన ఆటగాడు. ఈ యువ ఆటగాడు ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందే రికార్డు సాధించాడు. ప్రస్తుతం రషీద్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడుతున్నాడు. ఇందులో నిన్న జరిగిన మ్యాచ్ లో రషీద్ ఖాన్ టీ 20 క్రికెట్లో 300 వికెట్లు సాధించిన అతి పిన్న వయస్కుడిగా మరియు అత్యంత వేగంగా ఈ మార్క్ అందుకున్న బౌలర్ గా నిలిచాడు. రషీద్ ఖాన్ 2015 అక్టోబర్లో జింబాబ్వే తో జరిగిన మ్యాచ్ లో టీ 20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అయితే ఈ 300 వికెట్లు కేవలం అంతర్జాతీయ క్రికెట్ లో మాత్రమే కాకుండా వివిధ దేశాల్లో ఆడుతున్న లీగ్ లో కలిపి సాధించాడు. కేవలం 213 మ్యాచ్ల్లో అతను దీన్ని చేసిన వేగవంతమైన బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. ఇక సెప్టెంబర్ 19 న ప్రారంభం కానున్న ఐపీఎల్ టోర్నమెంట్ కోసం కరేబియన్ లీగ్ పూర్తయిన తర్వాత యూఏఈ లోని తన జట్టులో చేరనున్నాడు
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)