నిలకడగా ఆఫ్గాన్‌ .. టార్గెట్‌ ఛేదిస్తారా..?

నిలకడగా ఆఫ్గాన్‌ .. టార్గెట్‌ ఛేదిస్తారా..?

వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆఫ్గానిస్థాన్‌ ఆచితూచి ఆడుతోంది. 225 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆఫ్గాన్‌ ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది.  ఓపెనర్‌ హజ్రతుల్లా (10: 24 బంతుల్లో 1x4)ని మహ్మద్ షమీ క్లీన్‌ బౌల్డ్ చేశాడు. 17వ ఓవర్లో నయిబ్‌ (27: 42 బంతుల్లో 2x4)ను హార్ధిక్‌ పాండ్యా పెవిలియన్‌కు పంపించాడు. ప్రస్తుతం 22 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. క్రీజ్‌లో రహమత్‌ షా(24), హష్మదుల్లా(10) ఉన్నారు.