వరల్డ్‌కప్‌: టాస్‌ గెలిచిన ఆఫ్గానిస్థాన్..

వరల్డ్‌కప్‌: టాస్‌ గెలిచిన ఆఫ్గానిస్థాన్..

వరల్డ్‌కప్‌లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. చిన్న జట్లయినా ఈ టోర్నీలో ఆశ్చర్యపరుస్తున్న బంగ్లాదేశ్‌, ఆఫ్గానిస్థాన్‌ల మధ్య ఇవాళ మ్యాచ్‌ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్గానిస్థాన్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో సత్తా చాటుతున్న బంగ్లాదేశ్‌ ఈ మ్యాచ్‌ గెలిచి సెమీస్‌ రేసులోకి వెళ్లాలని భావిస్తోంది. పాయింట్ల పట్టికలో అట్టడుగునున్న ఆఫ్గాన్‌ జట్టు.. ఇవాళ విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది.