ఆ ముగ్గురితో ర‌జ‌నీ ఆడే ఆట‌..!

ఆ ముగ్గురితో ర‌జ‌నీ ఆడే ఆట‌..!
సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. దేశంలో మేమే మొన‌గాళ్లం అని భావించే ఖాన్‌ల త్ర‌యానికే అంతుచిక్కని ఫ‌జిల్ అత‌డు. సంపాద‌న‌లో పోటీప‌డ‌గ‌లిగినా, ఫ్యాన్ ఫాలోయింగ్‌లో ర‌జ‌నీతో వేరే ఏ హీరో పోటీప‌డ‌లేరన్న‌ది అక్ష‌ర స‌త్యం. బాలీవుడ్‌లో అమితాబ్ బ‌చ్చ‌న్ ఎంత‌టివాడో, సౌత్‌లో అంత‌టివాడుగా ఆద‌ర‌ణ పొందుతున్న ఏకైక స్టార్‌. అందుకే ర‌జ‌నీ క‌థానాయ‌కుడిగా న‌టించే ప్ర‌తి సినిమాపై ప్ర‌పంచం క‌ళ్లుంటాయి. అత‌డి సినిమాల్లో న‌టించే ప్ర‌తినాయ‌కుడు ఎవ‌రు? అన్న‌ది కూడా ప‌రిశీలన‌గా చూస్తుంది లోకం. ముఖ్యంగా ర‌జ‌నీ సినిమాల స‌ర‌ళి ప‌రిశీలిస్తే, అత‌డికి విల‌న్‌గా న‌టించేవాళ్లంతా బాలీవుడ్‌లో టాప్ హీరోలే. ఓ ర‌కంగా ఇది ఉత్త‌రాదిపై ద‌క్షిణాది సూప‌ర్‌స్టార్‌ సాగిస్తున్న స‌వారీగానే భావించాలి. కిలాడీ అక్ష‌య్‌కుమార్ అంత‌టివాడు ర‌జ‌నీ `2.ఓ`లో విల‌న్‌గా న‌టించి, అత‌డి లాంటి గొప్ప స్టార్‌తో న‌టించ‌డంతో నా జీవితం ధ‌న్య‌మైంద‌ని అన్నాడంటే అర్థం చేసుకోవ‌చ్చు. ర‌జ‌నీ స‌ర్ నుంచి స‌ల‌హాలు తీసుకున్నాన‌ని, అత‌డి ముందు సెట్‌లో నిల‌బ‌డ‌డమే ఒక అరుదైన గౌర‌వం అని ప‌బ్లిక్ వేదిక‌ల‌పై అక్కీ మాట్లాడిన తీరు ర‌జ‌నీ గొప్ప‌త‌నాన్ని గుర్తు చేస్తుంది. ర‌జ‌నీ న‌టిస్తున్న `కాలా`లో బాలీవుడ్ మేటి న‌టుడు నానా ప‌టేక‌ర్ విల‌న్‌గా న‌టించారు. నానా అంత‌టి న‌టుడు ర‌జ‌నీని అంతెత్తుకు ఎత్తేసే పాత్ర చేశాడంటే, అదీ సూప‌ర్‌స్టార్ స్టామినాకి ఒక స్థాయిని ఆపాదించ‌డం. ఇప్పుడు మ‌రో మేటి న‌టుడు, అవార్డుల కింగ్ ర‌జ‌నీకి విల‌న్‌గా న‌టించేందుకు రెడీ అవుతుండ‌డం కోలీవుడ్‌లో చ‌ర్చ‌కొచ్చింది. త‌దుప‌రి ర‌జ‌నీ- కార్తీక్ సుబ్బ‌రాజు చిత్రంలో బాబూ మోషాయ్ న‌వాజుద్దీన్ సిద్ధిఖి విల‌న్ గా న‌టించ‌నున్నాడు. ఇప్పుడ‌ర్థ‌మైందా? ఆ ముగ్గురితో ర‌జ‌నీ ఆటాడుతున్నాడా? ఆ ముగ్గురే ర‌జ‌నీతో ఆటాడుతున్నారా?