బాహుబలి 2 తరువాత అక్కడ విశ్వాసమే టాప్..!!

బాహుబలి 2 తరువాత అక్కడ విశ్వాసమే టాప్..!!

బాహుబలి 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్టైంది.  ఇందులో వచ్చిన రెండు సినిమాలు హిట్ తో పాటు ఏ రీజియన్ సినిమాకు రానటువంటి కలెక్షన్లను ఈ సినిమా సొంతం చేసుకుంది.  బాహుబలిని మించే సినిమా మరలా ఇండియాలో వస్తుందా అని అందరు ఎదురు చూస్తున్నారు.  కేవలం తెలుగులోనే కాదు.. కోలీవుడ్, బాలీవుడ్ లోను ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది.  

కోలీవుడ్ లో బాహుబలి 2 బయ్యర్లకు లాభాల పంటను పండించింది.  ఈ సినిమా తరువాత కోలీవుడ్ లో ఆ స్థాయిలో బయ్యర్లకు లాభాలు తెచ్చిన సినిమా అజిత్ విశ్వాసమే అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.  తమిళంలో రిలీజైన ఈ సినిమా ఇప్పటికి భారీ వసూళ్లు సాధిస్తోంది.  అజిత్ కు మాస్ లో ఉన్న ఇమేజ్ తో పాటు, ఎమోషన్ కూడా బాగా ఎటాచ్ కావడంతో సినిమా ఈ స్థాయిలో కలెక్షన్లు సాధించింది.  మరో కొన్ని రోజుల వరకు పెద్ద సినిమాలు తమిళనాడులో రిలీజ్ కావడం లేదు కాబట్టి, తమిళనాడులో విశ్వాసం బాహుబలి 2 ను మించిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు.