4 సెషన్లలో రూ.లక్ష కోట్లు తగ్గిన ఆర్ఐఎల్ మార్కెట్ క్యాప్ 

4 సెషన్లలో రూ.లక్ష కోట్లు తగ్గిన ఆర్ఐఎల్ మార్కెట్ క్యాప్ 

అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ఆందోళనల మధ్య మార్కెట్లలో పతనం ఇవాళ కూడా కొనసాగింది. మార్కెట్లు వరుసగా ఏడో రోజు పతనంతోనే ముగిశాయి. గత ఏడు రోజుల్లో సెన్సెక్స్ దాదాపు 1300 పాయింట్లు నష్టపోయింది. గత ఐదు రోజులుగా మార్కెట్ల పతనంలో ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)దే కీలక పాత్ర. ఐదు రోజుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ వేగం మొత్తం మాయమైంది. ఇవాళ్టి ట్రేడింగ్ లో కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ల మూడ్ మరింత చెడగొట్టింది. మార్కెట్ క్యాప్ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ జారి టీసీఎస్ వెనక్కి వెళ్లిపోయింది. ఐదు రోజుల్లో ఆర్ఐఎల్ దాదాపు రూ. లక్ష కోట్ల మార్కెట్ క్యాప్ కోల్పోయింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లో పతనం కొనసాగుతోంది. గత ఐదు రోజుల విషయానికొస్తే షేర్ లో 10 శాతం పతనం కనిపించింది. 52 వారాల గరిష్ట స్థాయి నుంచి షేర్ 11 శాతం కంటే ఎక్కువ నష్టపోయింది. ఈ పతనం కారణంగా ఇప్పటి వరకు రిలయన్స్ రూ.లక్ష కోట్ల మార్కెట్ క్యాప్ కోల్పోయింది. 

ఐదు రోజుల నుంచి వరుసగా పతనం అవుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ మే 3న 1417 హైకి చేరింది. కానీ ఆ తర్వాత వరుసగా పతనం జారీ అవుతోంది. ఇవాళ్టి ట్రేడింగ్ లో షేర్ 1250 స్థాయికి జారిపోయింది. ఆ తర్వాత షేర్ 1253 స్థాయి దగ్గర ముగిసింది.

మోర్గాన్ స్టాన్లీ ఆర్ఐఎల్ రేటింగ్ ని ఓవర్ వేట్ నుంచి తగ్గించి ఈక్వల్ వేట్ చేసింది. షేర్ లక్ష్యం రూ.1230 నుంచి పెంచి రూ.1349గా చేయడం జరిగింది. మోర్గాన్ స్టాన్లీ ఎనర్జీ (కోర్) వ్యాపారంలో ఇబ్బందుల కారణంగా రేటింగ్ తగ్గించింది. వైర్ లైస్ లో పెంచిన వాల్యుయేషన్స్, బ్రాడ్ బ్యాండ్ ఎన్ఏవీ జోడించడంతో లక్ష్యం పెంచడం జరిగింది.