మరో రికార్డ్ కోసం ట్రై చేస్తున్న విజయ్..!!

మరో రికార్డ్ కోసం ట్రై చేస్తున్న విజయ్..!!

రజినీకాంత్ తరువాత తమిళంలో అంతటి పేరు తెచ్చుకున్న నటుడు విజయ్.  ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సామాజిక కార్యక్రమాలు చేస్తూ తనలోని మానవత్వాన్ని చాటుకుంటున్నాడు.  ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ సర్కార్ సినిమా చేస్తున్నాడు.  సర్కార్ సినిమా మొదలు పెట్టిన దగ్గరి నుంచి తమిళనాడు మొత్తం షేక్ అవుతున్నది.  ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కరలేదు.  విజయ్ మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన తుపాకీ, కత్తి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.  ముచ్చటగా మూడోసారి సర్కార్ గా రాబోతున్నారు.  

ఇదిలా ఉంటె, విజయ్ తో తేరి, మెర్సల్ వంటి హిట్ సినిమాలు అందించిన అట్లీ.. దర్శకత్వంలో విజయ్ మరో సినిమా చేసేందుకు సిద్దమౌతున్నట్టు సమాచారం.  సర్కార్ తరువాత విజయ్.. అట్లీల సినిమా సెట్స్ మీదకు వెళ్తుందట.  ఏజీఎస్ మూవీస్ సంస్థ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నట్టు సమాచారం.  సర్కార్ ఫస్ట్ లుక్ టోన్ సంచలనం సృష్టించిన విజయ్ సినిమా విడుదల తరువాత మీరెన్ని సంచలనాలకు తెరతీస్తుందో చూడాలి.