మరో రెండు రాష్ట్రాల్లో ఎస్పీ,బీఎస్పీ పొత్తు 

మరో రెండు రాష్ట్రాల్లో ఎస్పీ,బీఎస్పీ పొత్తు 

ఉత్తర ప్రదేశ్ లో పొత్తు ఖరారు చేసుకున్న తర్వాత ఎస్పీ, బీఎస్పీ మరో రెండు రాష్ట్రాల్లో కూడా కలిసి పోటీచేయాలని నిర్ణయించాయి. మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో కూడా పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎస్పీ, బీఎస్పీ అధినేతలు అఖిలేష్ యాదవ్, మాయవతి అధికారికంగా ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లోనూ సమాజ్‌వాదీ పార్టీ కంటే ఎక్కువ సీట్లలో బీఎస్‌పీ పోటీ చేస్తుంది. మధ్యప్రదేశ్ లోని 29 నియోజకవర్గాల్లో ఎస్పీ 3 స్థానాల్లో పోటీ చేయనుంది. మిగిలిన చోట్ల బీఎస్పీ తమ అభ్యర్థులను బరిలోకి దింపనుంది. ఉత్తరాఖండ్ లోని 5 లోక్ సభ స్థానాల్లో ఘార్వాల్ నుంచి మాత్రమే పోటీ చేయనుంది. మిగిలిన స్థానాల్లో బీఎస్పీ పోటీ చేస్తుందని తెలిపారు.