28 ఏళ్ల తరువాత మళ్ళీ ఆ గౌరవం దక్కింది..!!

28 ఏళ్ల తరువాత మళ్ళీ ఆ గౌరవం దక్కింది..!!

66 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ఈరోజు కేంద్రప్రభుత్వం ప్రకటించింది.  బాలీవుడ్, కోలీవుడ్, మలయాళం చిత్రపరిశ్రమ ఎక్కువ అవార్డులను గెలుచుకుంటూ వస్తున్నాయి.  అయితే, ఈసారి మాత్రం.. తెలుగు సినిమాల హవాయే సాగింది.  66 వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో 7 తెలుగు సినిమాలు వివిధ కేటగిరీలో అవార్డులు గెలుచుకున్నాయి.  

ఇందులో మహానటి సినిమా ఉత్తమ తెలుగు సినిమా అవార్డును గెలుచుకోగా, ఉత్తమ నటి అవార్డును కీర్తి సురేష్ గెలుచుకున్నారు.  1990లో విజయశాంతి కర్తవ్యం సినిమాకు ఉత్తమ నటి అవార్డు వచ్చింది.  ఆ తరువాత 28 ఏళ్లకు మరలా తెలుగు సినిమా ఉత్తమనటి అవార్డును సొంతం చేసుకుంది.  తెలుగు సినిమాలు ఏకంగా 7 అవార్డులు గెలుచుకోవడం పట్ల ఏపీ ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.