వైరల్: ఓ మంచిపని ఆమె జీవితాన్ని మార్చింది... 

వైరల్: ఓ మంచిపని ఆమె జీవితాన్ని మార్చింది... 

కొన్ని రోజుల క్రితం ఓ మహిళ పరిగెత్తుకు వెళ్లి బస్సును ఆపి, ఓ అంథుడిని బస్సు ఎక్కించిన సంగతి తెలిసిందే.  దీనికి సంబంధించిన వీడియోను  తిరుపత్తూరు జిల్లాకు చెందిన ఐపీఎస్ అధికారి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఆమె చూపించిన దయ అందమైనది... ఈ ప్రపంచాన్ని జీవించేందుకు ఓ మంచి ప్రదేశంగా మార్చారు అని కాప్షన్ ఇచ్చారు.  ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్దిగంటల్లోనే వైరల్ గా మారింది.  

 నెటిజన్లు ఆమె చేసిన మంచి పనిని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు.  దీంతో కేరళలో ఆమె బాగా పాపులర్ అయ్యింది.  ఆమె పేరు సుప్రియ.  తిరుపత్తూరు జిల్లాలోని తిరువల్లలో నివసిస్తోంది.  అక్కడ స్థానికంగా ఉన్న జాయ్ అలుకాస్  కంపెనీలో పనిచేస్తున్నది.  తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగిని చేసిన మంచి పనిని స్వయంగా కలిసి మెచ్చుకోవాలని  చెప్పి అలుకాస్ చైర్మన్ జాయ్ అలుకాస్  త్రిస్సూర్ నుంచి తిరువల్లకు వచ్చారు. సుప్రియ నివసిస్తున్న ఇల్లు చూసి చైర్మన్ షాక్ అయ్యాడు.  చిన్న కిరాయి ఇంట్లో కుటుంబంతో నివసిస్తోంది. సుప్రియను అభినందించిన జాయ్ అలుకాస్ చైర్మన్ త్రిసూర్ కు ఆహ్వానించాడు.  ఆహ్వానం అందుకొని అక్కడికి వెళ్లిన సుప్రియను అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు చైర్మన్.  అన్ని రకాల సౌకర్యాలతో కూడిన ఓ ఇంటిని ఆమెకు బహుమానంగా ఇచ్చారు.  మానవత్వంతో చేసిన ఓ మంచి పని ఆమె జీవితాన్ని మార్చేసిందని చెప్పొచ్చు.