హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం.. చిత్తడి చిత్తడే..!

హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం.. చిత్తడి చిత్తడే..!

హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం కురిసిందే.. పలు చోట్ల భారీ వర్షం కురవగా.. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడింది.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తో పాటు కోఠి, అబిడ్స్, బేగంబజార్, సుల్తాన్ బజార్‌లో కుంభవృష్టి పడింది. నాంపల్లి, లక్డీకపూల్, మాసాబ్ ట్యాంక్‌, మెహిదీపట్నం, ఆసిఫ్ నగర్, అమీర్ పేట్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో జలమయం కాగా.. కొన్ని చోట్ల రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది... మోకాళ్ల లోతు నీటిలో రోడ్డుపై ఎక్కడ గొయ్యి ఉందో.. మరెక్కడ మ్యాన్‌హోల్ తెరుచుకుందోనని ముందుకు కదిలేందుకు నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు రానున్న ఐదు రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశముందని.. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.