మళ్ళీ 10,700 ఎగువకు

మళ్ళీ 10,700 ఎగువకు

అంతర్జాతీయ మార్కెట్లు అందించిన ఉత్సాహంతో మన మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. నిఫ్టి ఏకంగా 97 పాయింట్ల లాభంతో ముగిసింది. ఉదయం ఒక మోస్తరు లాభాలతో మొదలైన మార్కెట్‌కు సెషన్‌ కొనసాగే కొద్దీ మద్దతు లభించింది. ఐటీ, ఫార్మా మినహా అన్ని రంగా ల సూచీలు ఒక శాతం నుంచి రెండు శాతం వరకు లాబాలతో ముగిశాయి. పీఎస్‌యూ బ్యాంకుల్లో ఇండియన్‌ బ్యాంక్‌ 4 శాతం, పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఎస్‌బీఐ షేర్లు రెండు శాతంపైగా లబ్ది పొందాయి. నిఫ్టి గెయినర్స్‌లో గెయిల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హిందాల్కో ఉన్నాయి. వీటిలోగెయిల్‌ 4శాతం లాభపడింది. ఇక నష్టాలతో ముగిసిన షేర్లలో లుపిన్‌ ముందుంది. ఈ షేర్‌ రెండున్నర శాతంపైగా నష్టపోయింది. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, టీసీఎస్‌, కోల్‌ ఇండియా, సిప్లా షేర్లు నష్టాలతో ముగిశాయి.