మళ్ళీ సన్‌రైజర్స్‌ పగ్గాలు చేపటనున్న వార్నర్...

మళ్ళీ సన్‌రైజర్స్‌ పగ్గాలు చేపటనున్న వార్నర్...

ఆస్ట్రేలియా 2018 లో దక్షిణాఫ్రికా తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో బాల్ ట్యాంపరింగ్‌  కు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఆ కారణంగా ఐసీసీ అప్పుడు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అలాగే వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఇద్దరి పై ఒక సంవత్సరం నిషేధం విధించింది. అయితే మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చిన తరువాత స్మిత్ కు వార్నర్ కు కెప్టెన్ బాధ్యతలు అప్పగించలేదు ఆస్ట్రేలియా. వారికి బదులుగా ఆరోన్ ఫించ్ ఆ బాధ్యతలు చేపట్టాడు. అయితే అప్పటివరకు ఐపీఎల్ కెప్టెన్ గా ఉన్న స్మిత్ అలాగే వార్నర్ కు ఆ సంబంధిత రాజస్థాన్ రాయల్స్ అలాగే సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఫ్రాంచైజీలు వారిని కెప్టెన్ పదవి నుండి తప్పించాయి. అయితే సన్‌రైజర్స్‌ కు వార్నర్ తరువాత ఆ పదవిని కేన్‌ విలియమ్సన్‌ చేపట్టాడు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ సన్‌రైజర్స్‌ పగ్గాలు వార్నర్ అందుకోనున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సన్‌రైజర్స్‌ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వార్నర్ అభిమానులకు తెలియజేసాడు. అయితే ఈ వార్నర్ సేన 2017 ఐపీఎల్ ఛాంపియన్ ట్రోఫీ అందుకున్న విషయం తెలిసిందే. అయితే చూడాలి మరి ఇప్పుడు 2020 ఐపీఎల్ ట్రోఫీ ని కూడా ఈ వార్నర్ సేన ఎగరేసుకుపోతుందో... లేదో.