'అరవింద సమేత'లో 'అజ్ఞాతవాసి' పోలికలు !

'అరవింద సమేత'లో 'అజ్ఞాతవాసి' పోలికలు !

ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల సినిమా 'అరవింద సమేత' టీజర్ ఆగష్టు 159 విడుదలచేస్తామని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.  ఈ ప్రకటనతో పాటే ఒక కొత్త పోస్టర్ ను కూడ విడుదల చేసింది.  ఈ పోస్టర్  చూసిన వెంటనే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో కలిసి చేసిన 'అజ్ఞాతవాసి' చిత్రం గుర్తొస్తోంది చాలా మంది ప్రేక్షకులకు. 

ఎందుకంటే అజ్ఞాతవాసి టీజర్లో పవన్ ఒక చెక్క కుర్చీ పట్టుకుని పవర్ ఫుల్ డైలాగ్ చెబుతాడు, అదే తరహాలో పోస్టర్లో తారక్ ఉడెన్ చైర్ పై కూర్చొని కనిపిస్తున్నాడు.  రెండూ కూడ పోరాట సన్నివేశంలోని  దృశ్యాలే.  దీన్ని గమనించిన చాలా మంది తారక్ పాత్ర అజ్ఞాతవాసిలో పవన్ పాత్రలా ఉండబోతుందని అనుకుంటున్నారు.  ఓవర్ హైప్ కారణంగా 'అజ్ఞాతవాసి' ఫ్లాప్ అయింది కానీ అందులో పవన్ క్యారెక్టరైజేషన్, స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం అద్భుతంగా ఉంటాయి.  త్రివిక్రమ్ ఎన్టీఆర్ ను అదే స్థాయిలో ప్రెజెంట్ చేస్తే మంచి విషయమే.