అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మఘోష యాత్ర...

అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మఘోష యాత్ర...

ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేస్తూ వస్తున్న అగ్రిగోల్డ్ బాధితులు... మరోసారి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.3,965 కోట్లు అడ్వాన్స్ నిధులు విడుదలు చేయాలని, అగ్రి ఆస్తుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని కోర్టు పరిధిలో  జమ చేయాలని డిమాండ్ చేస్తూ నేడు సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో న్యాయ పోరాట దీక్ష శిబిరాన్ని నిర్వహిస్తున్న బాధితులు... ఈ రోజు ఏపీ సచివాలయానికి పాదయాత్రగా వెళ్లనున్నారు. ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో శాంతియుతంగా ఈ ఆత్మఘోష యాత్ర చేస్తామంటున్నారు బాధితులు. ఇకపై ఏ ఒక్క అగ్రిగోల్డ్ బాధితుడు ఆత్మహత్య చేసుకోకుండా నిరసనకు పిలుపునిచ్చినట్టు చెబుతున్నారు. మరోవైపు పాదయాత్రకు ఎలాంటి అనుమతులు లేవంటున్నారు పోలీసులు...