అగ్రిగోల్డ్‌ నిందితుడు విడుదల...

అగ్రిగోల్డ్‌ నిందితుడు విడుదల...

అగ్రిగోల్డ్‌ నిందితుల్లో ఒకరైన ఆ సంస్థ సీనియర్‌ అకౌంటెంట్‌ కె. సుందర్‌కుమార్‌ బుధవారం ఏలూరు జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో 25 మందిని నిందితులుగా పేర్కొని 17 మందిని అరెస్టు చేశారు. అయితే అందులో 12 మంది ఇప్పటికే బెయిల్‌పై విడుదలయ్యారు. తాజాగా జైల్లో ఉన్న అకౌంటెంట్‌ కె. సుందర్‌కుమార్‌కు బెయిల్‌ మంజూరు అయింది. మొత్తం 17 కేసుల్లో బెయిల్‌ మంజూరు కావడంతో ఏలూరు జైలు అధికారులు అతనిని విడుదల చేశారు. అయితే ఒడిసాలో ఉన్న కేసులో సుందర్‌కుమార్‌పై ఎలాంటి కేసు లేదని అధికారులు తేల్చారు.