రోడ్డెక్కిన తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితులు

రోడ్డెక్కిన తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితులు

తెలంగాణ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ ఫేర్ అసోసియేషన్ రోడ్డెక్కింది. రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని ధర్నా చౌక్ లో ఆందోళన దిగింది. తమకు రావలసిన రూ.500 కోట్లు ఇప్పించాలని డిమాండ్ చేసింది. తెలంగాణా లో ఉన్న సుమారు 1200 ఎకరాల అగ్రిగోల్డ్ భూమిని వెంటనే వేలం వేసి న్యాయం చేయాలని కోరింది. ఏపీలో మాదిరిగానే తెలంగాణా లో కూడా మరణించిన బాధితుల కు 5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేసింది. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించింది.