పతుంగులపై రఫేల్ డీల్ స్కాం ప్రశ్నలు

పతుంగులపై రఫేల్ డీల్ స్కాం ప్రశ్నలు

రఫేల్ డీల్ లో జరిగిన స్కాం ను కాంగ్రెస్ పార్టీ వినూత్నంగా ప్రచారం చేస్తోంది. రాజస్థాన్ లోని జయపురలో మకర సంక్రాంత్రి సందర్భంగా గాలి పటాల ఉత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలో కాంగ్రెస్ పార్టీ రఫేల్ డీల్ కు సంబంధించిన పలు ప్రశ్నలను పతంగులపై  ముద్రించి పంపిణీ చేస్తున్నారు. పతంగులు తీసుకున్న ప్రజలంతా ఈ ప్రశ్నలను ఆసక్తిగా చూస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. ఒప్పందంలో అవకతవకలు జరిగాయంటూ పలు అంశాలను ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. ఒప్పందంలో జరిగిన అవినీతిపై మోడీ సర్కార్‌ను ప్రశ్నించాలన్న రాహుల్‌గాంధీ పిలుపుతో కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.