కారును ఆవు పేడతో ఎందుకు అలికిందంటే..

 కారును ఆవు పేడతో ఎందుకు అలికిందంటే..

రోజు రోజుకు మండిపోతున్న ఎండలతో జనాలు నానా అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు వడగాడ్పుల ప్రభావంతో బయట కాలు పెట్టాలంటేనే జంకుతున్నారు. ఇక వాహనాల్లో ప్రయాణిస్తున్న వారి ఇబ్బందులు చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో ప్రయాణంలో సూర్యుడి ప్రతాపం నుంచి ఉపశమనం పొందేందుకు ఓ మహిళ కారు మొత్తాన్ని పేడతో అలికింది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ మహిళ 45 డిగ్రీల వేడికి కారులో కూడా భగభగలు తప్పకపోవడంతో కారును ఆవుపేడతో అలికారు. ఇలా చేయడం వల్ల బయట వేడి కారు లోపలికి వచ్చే అవకాశం లేదని ఆమె తెలిపారు. అహ్మదాబాద్‌కు చెందిన సీజల్ షా చేసిన ఈ వినూత్న ప్రయత్నం స్థానికుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ కారును ఫొటో తీసి కొందరు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి.