ఎమ్మెల్యేల అనర్హతపై జడ్జీల్లో భిన్నాభిప్రాయాలు...

ఎమ్మెల్యేల అనర్హతపై జడ్జీల్లో భిన్నాభిప్రాయాలు...

తమిళనాడు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు ఓ నిర్ణయానికి రాలేకపోయింది... దినకరన్ వర్గం ఎమ్మెల్యేలపై తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేయడాన్ని ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ సమర్థించారు. అయితే మరో న్యాయమూర్తి సుందర్... ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడాన్ని వ్యతిరేకించారు. ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ ఓ నిర్ణయానికి రాలేకపోవడంతో ఎమ్మెల్యేల అనర్హతపై యథాతథస్థితిని కొనసాగిస్తారు. పిటిషన్‌ను ముగ్గురు సభ్యుల బెంచ్‌కి పంపే అవకాశం ఉంది. మద్రాస్ హైకోర్టు నిర్ణయంతో 18 మంది దినకరన్ వర్గ ఎమ్మెల్యే భవితవ్యం సందిగ్ధంలో పడింది. 

అనర్హత వేటు వేస్తే ఉప ఎన్నికలు వస్తాయి... అనర్హత రద్దు అయితే అసెంబ్లీలో పలనీస్వామి సర్కార్‌కు వ్యతిరేకంగా ఓటు వేయొచ్చు అనుకున్నారు. కానీ, మద్రాస్ హైకోర్టు అనూహ్యమైన తీర్పు ఇచ్చింది. పిటిషన్‌ను ముగ్గురు సభ్యుల న్యాయమూర్తుల బెంచ్‌కి పంపే ఆలోచనలో ఉంది. ఈ నిర్ణయంతో దినకరన్ వర్గం తలపట్టుకోగా... మరోవైపు కోర్టు నిర్ణయంతో పలనిస్వామికి ఊరట దక్కింది. పిటిషన్ అలాగే ఉన్నంతకాలం పలనిస్వామి సర్కార్‌కు వచ్చిన నష్టమేమీ లేదు.