కేంద్రంలో రాగానే రుణమాఫీః రాహుల్‌

కేంద్రంలో రాగానే రుణమాఫీః రాహుల్‌

కాంగ్రెస్‌ లేదా యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణాలను మాఫీ చేస్తుందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఆయన ఎన్నికల ప్రచార సభలో ఇవాళ  మాట్లాడారు. తాము ఇటీవల అధికారంలోకి వచ్చిన అన్ని రాష్ట్రాల్లో కేవలం పది రోజుల్లోనే రైతుల రుణ మాఫీ చేశామని, కేంద్రంలోనే ఇదే విధంగా చేస్తామని అన్నారు. మోడీ  మాదిరిగా తాను ఎక్కడా మాట తప్పలేదని ఆయన అన్నారు. ఎయిర్‌ ఫోర్స్‌ సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని కాపాడుతుంటే... అదే ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సొమ్ముమను ప్రధాని మోడీ తన మిత్రుడు అనిల్‌ అంబానీ చేబులో వేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎవరు ఏమన్నా... ఎన్ని విమర్శలు చేసినా... తమ పార్టీ మాత్రం ఇచ్చిన వాగ్ధానాలను పూర్తి చేసి తీరుతుందని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడి కెళ్ళినా... మోడీ ప్రజల్లో విద్వేషాలను రెచ్చ గొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.