రాహుల్ తెలంగాణ పర్యటన ఖరారు...

రాహుల్ తెలంగాణ పర్యటన ఖరారు...

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ... తెలంగాణలో పర్యటించనున్నారు. ఆగస్టు నెలలో రాహుల్‌ పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. వచ్చే నెలలో బస్ యాత్రలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పాల్గొననున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలో రాహుల్ పర్యటన సాగనుంది. సంస్థాగతంగా సాంకేతికంగా పార్టీ బలోపేతంపైనే అధినేత దృష్టి సారించారు. ఈ రెండు జిల్లాల్లో ఎక్కడో ఒక దగ్గర బహిరంగసభలో రాహుల్‌ గాంధీ పాల్గొని ప్రసంగించనున్నారు.