ఎగ్జిట్ ఫలితాలను చూసి భయపడకండి...

ఎగ్జిట్ ఫలితాలను చూసి భయపడకండి...

ఓట్ల లెక్కింపుకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో.. కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘ప్రియమైన కాంగ్రెస్ కార్యకర్తలకు.. రాబోయే 24 గంటలు మనకెంతో ముఖ్యమైన సమయం. ఎంత వీలైతే అంత అప్రమత్తంగా ఉండండి. భయపడకండి..మనం వాస్తవాల కోసం పోరాడుతున్నాం.ఎగ్జిట్‌ పోల్స్‌ను చూసి భయపడకండి. వాటి వల్ల వస్తున్న పరిణమాల పట్ల చలించకండి. మిమ్మల్ని మీరు నమ్మండి. పార్టీ మీద విశ్వాసం ఉంచండి. మీ శ్రమ వృథాగా పోదు..జై హింద్‌’ అని ట్వీట్‌ చేశారు. ఆదివారం నాడు జరిగిన చివరి దశ పోలింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని పలు సర్వే సంస్థలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో రాహుల్ కార్యకర్తల్లో జోష్ నింపేందుకు ట్వీట్ చేశారు.