రష్యా వ్యాక్సిన్ పై ఎయిమ్స్ డాక్టర్ కీలక వ్యాఖ్యలు..!

రష్యా వ్యాక్సిన్ పై ఎయిమ్స్ డాక్టర్ కీలక వ్యాఖ్యలు..!

రష్యా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ‘స్పుట్నిక్‌ వీ’ పై ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియ కీలక వ్యాఖ్యలు చేసారు. ‘స్పుట్నిక్‌ వీ’ పట్ల ఆచితూచి వ్యవహరించాలని అన్నారు. వ్యాక్సిన్‌ను వాడే ముందుగా సురిక్షితమైనదా, ప్రపంచస్థాయి ప్రమాణాలను కలిగిఉందా అనేది పరిశీలించాలని తెలిపారు.  వ్యాక్సిన్‌ పరీక్షల శాంపిల్‌ పరిమాణం, దీని సామర్థ్యం వంటి ప్రాతిపదికన భద్రతను పసిగట్టవచ్చని తెలిపారు. వ్యాక్సిన్‌తో అభివృద్ధి చెందిన యాంటీబాడీలు ఎంతకాలం కొనసాగుతాయనేది కూడా పరిశీలించాలని తెలిపారు. మొదట వ్యాక్సిన్‌ సురక్షితమైనదా లేదా అనేది వెల్లడికావాల్సి ఉందని, పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేపట్టేముందు ఇది ప్రాథమిక అంశమని ఆయన అన్నారు. తుది పరీక్షలు పూర్తి చేయకుండానే అధ్యక్షుడు పుతిన్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశామని ప్రకటించటంతో గులేరియ చేసిన వ్యాఖ్యలకు బలం చేకూరింది.