వాజ్‌పేయి హెల్త్‌ బులెటిన్ విడుదల....

వాజ్‌పేయి హెల్త్‌ బులెటిన్ విడుదల....

బీజేపీ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉంది... గత కొన్నాళ్లుగా కిడ్నీ  సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన... ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రధాని నరేంద్ర మోడీ సహా బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు ఎయిమ్స్‌కు వచ్చిన ఆయన పరిస్థితిపై ఆరా తీస్తుండగా... మాజీ ప్రధాని ఆరోగ్య పరిస్థితి పై అధికారిక ప్రకటన విడుదల చేసింది ఎయిమ్స్... గత 9 వారాలుగా వాజ్‌ పేయి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారని పేర్కొన్న వైద్యులు... దురదృష్టవశాత్తు గత 24 గంటలుగా ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నట్టు తన ప్రకటనలో పేర్కొన్నారు ఎయిమ్స్ వైద్యులు.