ఇండియా కాన్ఫరెన్స్ 2019 కు ఎంపీ అసద్

ఇండియా కాన్ఫరెన్స్ 2019 కు ఎంపీ అసద్

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. బొస్టన్ లో  ఈనెల 16, 17 తేదీల్లో జరిగే ఇండియా కాన్ఫరెన్స్ 2019 సదస్సులో పాల్గొంటారు.  హర్వార్డ్ బిజినెస్ స్కూలు, హర్వార్డ్ కెన్నడీ స్కూలు గ్రాడ్యూయేట్ విద్యార్ధులు నిర్వహించే ఈ సదస్సులో ప్రసంగిస్తారు.  ఆయనతోపాటు జగ్గీవాసుదేవ్, ప్రముఖ దర్శకుడు రాజమౌళి, నవీన్ జిందాల్, ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్, లోక్ సత్తా జాతీయ కన్వీనర్ జయప్రకాష్ నారాయణ, నిర్మాత శోభు యార్లగడ్డ ప్రసంగించే వారిలో ఉన్నారు.