వైద్య సిబ్బందికి ఎయిర్ ఏషియా బంపర్ ఆఫర్.!

  వైద్య సిబ్బందికి ఎయిర్ ఏషియా బంపర్ ఆఫర్.!

కరోనా మహమ్మారి పై ప్రత్యక్షంగా యుద్ధం చేస్తున్నది కేవలం డాక్టర్ లు వైద్య సిబ్బంది మాత్రమే అని చెప్పవచ్చు. ఎందుకంటే వారు భయంకరమైన వైరస్ సోకిన వారిని ప్రత్యక్షంగా తాకి మరీ వైద్యం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కూడా వైద్యం చేస్తూ ప్రజలకు భరోసా కపిస్తున్నారు. కాగా అంత గొప్ప పని చేస్తున్న డాక్టర్లకు ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కరోనాపై ముందు నిలిచి పోరాడుతున్న వైద్యుల కోసం 50 వేల సీట్లు కేటాయిస్తున్నట్టు ఎయిర్ ఏషియా ఇండియా విభాగం వెల్లడించింది. కరోనాపై ముందు నిలిచి పోరాడుతున్న వైద్యుల కోసం 50 వేల సీట్లు కేటాయిస్తున్నట్టు ఎయిర్ ఏషియా ఇండియా విభాగం వెల్లడించింది. అయితే ఆ సీట్లకు కనీస చార్జీని మినహాయించారు. ప్రయాణం చేసే డాక్టర్ కేవలం  ఎయిర్ పోర్టు ఫీజు, ఇతర పన్నులు చెల్లిస్తే చాలు. దేశంలో ఎక్కడికైనా నామమాత్రపు చార్జీతో ప్రయాణించవచ్చు. అయితే ఈ ఆఫర్ ను వినియోగించుకోవాలంటే వైద్యులు తమ వివరాలను జూన్ 12 లోపు నమోదు చేసుకోవాలి. కాగా ఈ ఆఫర్ జూలై 1 నుంచి సెప్టెంబరు 30 మధ్య అమల్లో ఉంటుంది.