మరో ముందడుగు.. అస్త్ర క్షిపణి పరీక్ష విజయవంతం

మరో ముందడుగు.. అస్త్ర క్షిపణి పరీక్ష విజయవంతం

భారత వాయుసేనను పటిష్టం చేసే దిశగా మరో ముందడుగు పడింది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసిన అస్త్ర క్షిపణిని వాయుసేన విజయవంతంగా పరీక్షించింది. పశ్చిమబెంగాల్‌లోని ఓ ఎయిర్ బేస్ నుంచి సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం ద్వారా అస్త్ర క్షిపణి దూసుకెళ్లింది. ఈ ప్రయోగాన్ని డీఆర్డీవో, వాయుసేన ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. అస్త్రను ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ గా డెవలప్ చేశారు. దాదాపు 70 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను అస్త్ర ఛేదించగలదు.