కూలిన జాగ్వార్ ఫైటర్ 

కూలిన జాగ్వార్ ఫైటర్ 

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు  సంబంధించి జాగ్వార్ ఫైటర్ యూపీలోని కూషీ నగర్ సమీపంలో కుప్ప కూలింది.  లక్నోకు సుమారు 322 కి.మీ. దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదం నుంచి పైలట్ 
సురక్షితంగా బయటపడ్డాడు. జాగ్వార్ కూలిన వెంటనే  మంటల్లో చిక్కుకుంది.  గోరఖ్‌పూర్ విమానాశ్రయం నుంచి బయలు దేరిన జాగర్ ఈ ప్రమాదానికి గురైంది. విమానం కుప్పకూలడానికి కారణంపై దర్యాప్తునకు అధికారులు ఆదేశించారు. వివరాలు తెలియాల్సి ఉన్నాయి.