ప్రతి అనౌన్స్ మెంట్ తర్వాత 'జై హింద్' అని చెప్పండి

ప్రతి అనౌన్స్ మెంట్ తర్వాత 'జై హింద్' అని చెప్పండి

జాతీయ విమానయాన సంస్థ ఎయిరిండియా కేబిన్, కాక్ పిట్ క్రూకి కొత్త ఆదేశాలు వచ్చాయి. దాని ప్రకారం ఇకపై విమానంలో చేసే ప్రతి ప్రకటన తర్వాత సిబ్బంది అంతా 'జై హింద్' అని చెప్పాల్సి ఉంటుంది. ఎయిరిండియా విడుదల చేసిన సర్కులర్ లో ' ఈ క్షణం నుంచి ప్రతి ప్రకటన చివర ఉత్సాహంగా 'జై హింద్' అని చెప్పాలని' పేర్కొనడం జరిగింది.

జాతీయ విమానయాన సంస్థలో ప్రస్తుతం 3,500 మంది కేబిన్, 1,200 మంది కాక్ పిట్ క్రూ సిబ్బంది ఉన్నారు. ఎయిరిండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను అశ్విని లోహానీ నిర్వహిస్తున్నారు. 2016లో బాధ్యతలు చేపట్టినపుడు కూడా అశ్విని ఇలాంటిదే ఒక సర్కులర్ జారీ చేశారు.